Hyderabad, ఆగస్టు 2 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 02.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: శ్రావణ మాసం : శనివారం, తిథి : శు. అష్టమి, నక్షత్రం : విశాఖ

మేష రాశి వారు అన్నిటా పునరాలోచనలు తప్పనిసరిగా చేయండి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఖర్చులు, శ్రమ ఒకింత ఎక్కువగా ఉంటాయి. అధికారులచే ఒత్తిడులు ఉంటాయి. నిర్లక్ష్యంగా సాగకండి. సాధ్యమైనంతవరకు అనవసర కొనుగోలు లేకుండా జాగ్రత్తపడండి. వృత్తి, వ్యాపారాల్లో ఆశావహ దృక్పథంతో సాగాలి. సంతానంలో సంయమనాలు అవసరం. వారి కోరికలు తీర్చలేకపోవచ్చు.

వృషభ రాశి ఉత్సాహవంతంగా పనులు చేపట్టుకుంటారు. ఆర్థిక, ఆరోగ్యాలు సాధారణంగా ఉంటాయి. నూతన ఎగ్రిమెంట్లు, సొంత బుద్ధికి ప్రాధాన్యతనిచ్చుకోవాలి. సోదరవర్గంతో మాటలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలకు తుది రూపమివ్వగలరు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్...