Hyderabad, ఆగస్టు 1 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 01.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: శ్రావణ మాసం : శుక్రవారం, తిథి : శు. అష్టమి, నక్షత్రం : స్వాతి

మేష రాశి వారి పనుల్లో ఆటంకాలు, మానసిక ఆందోళన, భూ-గృహ-వాహనాదులు విక్రయించుట, ప్రయాణములు, గృహమందు కలహములు, వేళ తప్పి భోజనము చేయడం, ఆర్థిక ఇబ్బందులు, అపమృత్యు భయములు, చెడు వారితో స్నేహము, స్థిరత్వం లేమి వంటివి కలగగలవు. ప్రతిరోజు సుందరకాండ సంగ్రహము పఠించిన మేలు కలుగును.

వృషభ రాశి వారికి శరీరబలం, కీర్తి, ఉత్సాహము, బంధు-మిత్రుల కలయిక, తలచిన పనులు నెరవేరుట, నూతన వస్తువుల కొనుగోలు, మనస్సున ధర్మకార్యములందు ఆసక్తి, బంధుమిత్రుల కలయిక, నూతన వ్యక్తులతో ఆనందం, నూతన ఉత్సాహము, సంఘమున గౌరవాభివృద్ధి, పరిచయములు కలుగును.

మిథున రాశి వారికి మానసిక ఒత్తిడి, పనులలో ఆటం...