భారతదేశం, నవంబర్ 26 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. శుక్రుడు కూడా కాలానుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. శుక్రుడు రాశి మార్పు చెందినప్పుడు, అది ద్వాదశ రాశుల వారి జీవితంపై అనేక ప్రభావాలను, అనేక విధాలుగా మార్పులను తీసుకొస్తుంది.

శుక్రుడు సంపద, ప్రేమ, అందం, విలాసాలు, కళలు మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు రాశి మార్పు జరిగినప్పుడు అనేక రకాల మార్పులు మన జీవితంలో చోటుచేసుకుంటాయి. ఈరోజు నవంబర్ 26న శుక్రుడు రాశి మార్పు చెందాడు. ఇది ద్వాదశ రాశుల వారికి అనేక విధాలుగా మార్పులను కలిగిస్తుంది. కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు.

జాతకంలో శుక్ర గ్రహం శుభప్రదమైన లేదా బలమైన స్థితిలో ఉంటే, అప్పుడు సంతోషం, మంచి ప్రేమ జీవితాన్ని అనుభూతి చెందవచ్చు. శుక్రుడి సంచార...