భారతదేశం, జనవరి 1 -- హైదరాబాద్‏లో ఏటా జరిగే నుమాయిష్‌ మెుదలైంది. సుమారు నెలా పదిహేను రోజులపాటు నాంపల్లి నుమాయిష్ జరుగుతుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు వెళ్లవచ్చు. సెలవు దినాల్లో రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ఉంటుంది.

నుమాయిష్ కోసం వచ్చేవారి కోసం నగర శివారు ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మెట్రో రైలు సేవలను కూడా వినియోగించుకోవచ్చు. మెట్రో సేవలు రోజులలో రాత్రి 11.30 గంటల వరకు, వారాంతాల్లో, ప్రభుత్వ సెలవు దినాలలో అర్ధరాత్రి వరకు పనిచేస్తాయి. సెక్యూరిటీపై ఎక్కువ ఫోకస్ చేసింది పాలకవర్గం. అజంతాగేట్, గాంధీభవన్, మాలకుంట రోడ్, ప్రవేశ ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. తనిఖీ చేసిన తర్వాతే సందర్శకులను లోపలికి పంపిస్తారు. వృద్ధుల కోసం వాలంటీర్లతో వీల్ చైర...