భారతదేశం, డిసెంబర్ 16 -- ఈరోజు సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. ఈరోజు నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం ఉంటుంది. ధనుర్మాసం చాలా శుభప్రదమైనది. ఈ నెల రోజులు కూడా దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలం కనుక, ధనుర్మాసంలో చేసే పూజలకు చాలా విశేషత ఉంటుంది. ధనుర్మాసంలో కొన్ని శుభకార్యాలు జరపరు. ధనుర్మాసంలో కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. అలాగే ధనుర్మాసంలో ఏం చేయాలి అనే దాని గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం.

ధనుర్మాసం నెల రోజులు కూడా విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధించాలి. అలాగే పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు ధనుర్మాసం నెల రోజులు కూడా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, ఆవు పేడతో గొబ్బెమ్మలను పెట్టి, ప్రతిరోజు దీపారాధన చేసి పూజ చేస్తారు. భక్తిశ్రద్ధలతో ఇలా చేయడం వలన కోరిన వరుడు లభిస్తాడని నమ్ముతారు.

ధనుర్మాసంలో విష్ణువును ఆరాధించి మొదటి 15 రోజులు చక్కెర ...