Andhrapradesh, ఆగస్టు 15 -- ఏపీ సర్కార్ మరో సూపర్ సిక్స్ పథకం అమలుకు సిద్దమైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రయాణ ఖర్చుల భారం నుంచి విముక్తి కల్పిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే పథకాన్ని స్త్రీ శక్తి పేరుతో ఇవాళ ప్రారంభించనుంది. ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ పిఎన్బీఎస్ లో కూటమి నేతలతో కలిసి ప్రారంభింస్తారు.

ఈ పథకం కోసం సుమారుగా రూ. 1942 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ మొత్తం భరించడం కష్టమే అయినా.. మహిళలకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కల్గించేలా ఉంటుందని ప్రభుత్వం ఈ పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రయాణికులు రాష్ట్ర వాసులు అయ్యుండాలి. ఓటర్ ఐడీ, ఆధార్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ ల...