భారతదేశం, అక్టోబర్ 27 -- గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. దీంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. కుజుడు కూడా కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాడు. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి. అక్టోబర్ 27 అంటే ఈరోజు కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. 40 రోజులు పాటు అదే రాశిలో ఉంటాడు.

ఆ తర్వాత డిసెంబర్ 7న రాశి మార్పు చెందుతాడు. కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు రుచక రాజయోగం ఏర్పడుతుంది. ఈ రుచక రాజయోగం కొన్ని రాశుల వారికి ఎక్కువ లాభాలను తీసుకురాబోతోంది.

ఈరోజు నుంచి 40 రోజులు పాటు ఈ రాశుల వారికి అనేక విధాలుగా కలిసివస్తుంది. సంతోషంగా ఉంటారు, ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభ...