భారతదేశం, నవంబర్ 20 -- శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర కోసం శబరిమల ఆలయం తెరిచినప్పటి నుండి ఇప్పటివరకు మూడున్నర లక్షల మందికిపైగా భక్తులు సందర్శించారు. ఇక స్పాట్ బుకింగ్‌ల విషయంలో గందరగోళం నెలకొంది. అనుకున్నదానికంటే ఎక్కువ మంది వీటి ద్వారా వెళ్తుండటంతో రద్దీ నెలకొంటోంది.

అయితే తాజాగా శబరిమల యాత్రపై అధికారులు కొత్త ఆంక్షలు విధించారు. నేటి నుంచి సోమవారం వరకు స్పాట్ బుకింగ్‌లను 5,000కి తగ్గించారు. గతంలో ఈ పరిమితి 20,000 వరకు ఉంది. అటవీ మార్గంలో నడిచి వచ్చే స్వాములకు ప్రత్యేక పాసులు ఇస్తారు. యాత్రికులు అటవీ శాఖ నుండి పాస్‌లు పొందాలని నివేదికలు చెబుతున్నాయి.

కానీ అడవి మార్గంలోనూ వచ్చే భక్తులకు సైతం పాసుల విషయంలో కొత్త నిర్ణయం తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇటు నుంచి వచ్చేవారికి కూడా 5 వే...