భారతదేశం, నవంబర్ 18 -- తెలంగాణ రాష్ట్ర ప్రధాన పౌర సేవల ప్లాట్‌ఫామ్ మీసేవా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. మంగళవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి సరళమైన, సురక్షితమైన, చాట్ ఆధారిత ఇంటర్‌ఫేస్‌ను అందిస్తోంది. దీని ద్వారా ఎన్నో రకాల సేవలు పొందవచ్చు. పౌరులు ఇంటి నుండే విద్యుత్, నీటి బిల్లులు, ఆస్తి పన్ను చెల్లించగలుగుతారు. ప్రభుత్వ కార్యాలయాలు లేదా మీసేవా కేంద్రాలను సందర్శించాల్సిన అవసరం ఉండదు. అయితే మెుదట సర్టిఫికెట్ సేవలను వాట్సాప్‌లో మీరు పొందవచ్చు. తర్వాత మిగిలిన సేవలు అందుబాటులోకి వస్తాయి.

ఫోన్‌ల నుండి నేరుగా వివిధ ప్రభుత్వ ధృవపత్రాల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీసేవా ప్రస్తుతం అందిస్తున్న అన్ని సేవలు క్రమంగా వాట్సాప్‌లో అందుబాటులోకి వస్తాయి. రేషన్ కార్డుల జారీ, రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుకింగ్, పంటల మార్కెట్ ధరలు, దైవ...