భారతదేశం, నవంబర్ 27 -- తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మెుదలైంది. మూడు విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబరు 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనుంది. ఆయా రోజుల్లోనే ఫలితాలను కూడా ప్రకటిస్తారు.

ఎన్నికల సంఘం ప్రకారం రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తారు. పలు కేసుల్లో జారీ చేసిన స్టే ఆర్డర్లతో 32 గ్రామ పంచాయతీలు, 292 వార్డుల్లో ఎన్నికలను జరగడం లేదు.

మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నవంబర్ 27 నుంచి నామినేషన్లు. సర్పంచ్, వార్డు సభ్యులు వారి నామినేషన్లను సమర్పించవచ్చు. నవంబర్ 29వ తేదీ వరకు వీటిని స్వీకరిస్తారు. నవంబర్ 30వ తేదీ నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. వీటిపై డిసెంబరు 1న వినతులను స్వీకరిస్తారు. డిసెంబర్ 2వ తేదీన ఆయా ద...