భారతదేశం, నవంబర్ 3 -- పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్‌ మీద ప్రైవేట్ కాలేజీలు నవంబర్ 3 నుంచి బంద్ పాటిస్తున్నాయి. నవంబర్ 6న లక్ష మంది సిబ్బందితో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పిలుపునిచ్చాయి. నిరసనకు ముందు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఏంసీఏ, BEd, నర్సింగ్ సహా కళాశాలలు నవంబర్ 3 నుండి నిరవధికంగా మూసివేశారు. విశ్వవిద్యాలయాల పరిధిలోని పరీక్షలను వాయిదా వేయాలని సమాఖ్య కోరింది.

తెలంగాణ ఉన్నత సంస్థల సంఘాల సమాఖ్య ఛైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతూ, కళాశాలలకు ఇవ్వాల్సిన రీయింబర్స్‌మెంట్ ఫీజు బకాయిల ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిధులు విడుదల చేసేదాకా వీధుల్లోకి రావడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు.

దీపావళి పండుగ నాటికి కళాశాలలు రూ .1,200 కోట్లు ఇవ్వాలని కోరాయని , మిగిలిన మొత్తానికి ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, ఫీజు బక...