భారతదేశం, సెప్టెంబర్ 15 -- తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్య (FATHI) సెప్టెంబర్ 15, 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ప్రొఫెషనల్ కళాశాలలు నిరవధికంగా బంద్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడంలో విఫలమైనందుకు నిరసనగా ఇంజనీర్ల దినోత్సవాన్ని బ్లాక్ డేగా పాటిస్తోంది సమాఖ్య.

ఆదివారం(సెప్టెంబర్ 14)న ఫెడరేషన్ తన జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించింది. తెలంగాణలోని వేలాది ప్రైవేట్ కళాశాలల ఆర్థిక సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రభుత్వం పెండింగ్ బకాయిలపై స్పష్టత ఇవ్వలేదని, కళాశాల యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో ఎటువంటి నిర్దిష్ట ప్రతిపాదనను ఉంచలేదని సమాఖ్య వెల్లడించింది.

అయితే తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ...