Telangana,hyderabad, ఆగస్టు 30 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఇవాళ ఉదయం 10. 30 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈసారి నాలుగైదు రోజులు నిర్వహించే అవకాశం ఉంది.

ఇవాళ ప్రారంభమయ్యే ఉభయ సభల్లోనూ సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఇటీవల మృతిచెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై అసెంబ్లీలో, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డిపై మండలిలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి నివాళులర్పిస్తారు. వీటిపై చర్చ తర్వాత.. మొదటి రోజు సమావేశాలు వాయిదా పడతాయి.

ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగే అవకాశం ఉంది. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను సభలో పెట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. సభలో చర్చించిన తర్వాత. ప్రభుత్వం కీలక...