భారతదేశం, జనవరి 7 -- స్టాక్ మార్కెట్లలో లాభాల స్వీకరణ (Profit Booking) కొనసాగుతున్న తరుణంలో, ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ, జనవరి 6 (మంగళవారం) నాటి ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 500 పాయింట్లకు పైగా పతనమై ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. అయితే, ఇలాంటి అస్థిరమైన పరిస్థితుల్లో కూడా కొన్ని షేర్లు సాంకేతికంగా బలంగా కనిపిస్తున్నాయి. ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు సుమీత్ బగాడియా నేటి కోసం 5 ప్రత్యేక 'బ్రేక్ అవుట్' స్టాక్స్‌ను సిఫార్సు చేశారు.

ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా, టెక్నికల్ చార్ట్‌లపై పటిష్టంగా ఉన్న కింది షేర్లను కొనుగోలు చేయవచ్చని సూచించారు.

ఈ ఫార్మా స్టాక్ ప్రస్తుతం రూ. 1469.60 వద్ద ఉంది. కీలక...