భారతదేశం, ఫిబ్రవరి 19 -- రీసెంట్‌గా టాలీవుడ్‌లో వచ్చిన మ్యూజికల్ పొయెటిక్ రొమాంటక్ లవ్ స్టోరీ సినిమా నిలవే. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రేయాసి సేన్ హీరోయిన్‌గా చేసింది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా కీలక పాత్రలు పోషించారు.

పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కె వెన్నం నిర్మించిన నిలవే సినిమా వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల అయింది. థియేట్రికల్ రిలీజ్ నుంచే నిలవే సినిమా అద్భుతమైన రెస్పాన్స్‌ను తెచ్చుకుంటోంది.

బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా అందరి ఆదరణ అందుకుంటున్న నేపథ్యంలో మగంళవారం (ఫిబ్రవరి 17) నాడు రామానాయుడు స్టూడియోలో నిలవే సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, గీత రచయిత చంద్రబోస్ వీడియో బైట్ ద్వా...