Hyderabad, జూన్ 17 -- తమిళ క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామా ది వర్డిక్ట్ (The Verdict). మే 30వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, సుహాసినిలాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు ఐఎండీబీలో 8.9 రేటింగ్ ఉంది. ఈ మూవీ జూన్ 26 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

కొత్త దర్శకుడు కృష్ణ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా ది వర్డిక్ట్. శ్రుతి హరిహరన్, వరలక్ష్మి శరత్‌కుమార్, సుహాసిని మణిరత్నం, ప్రకాష్ మోహన్‌దాస్, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించిన 'ది వర్డిక్ట్' మూవీ మే 30న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను పూర్తిగా అమెరికాలోనే షూట్ చేయడం విశేషం.

ఈ మూవీని జూన్ 26 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఓ హత్య, ఎంతో మంది అనుమానితులు, కోర్టు రూమ్ లో వాదనల చుట్టూ తిరిగే ఈ సినిమాకు ఓటీటీల...