భారతదేశం, అక్టోబర్ 7 -- యునిక్ కాన్సెప్ట్ లతో, వైవిధ్యమైన కథలతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు తమిళ స్టార్ ధనుష్. ఇప్పుడు ఇడ్లీ కడై అంటూ థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజైంది. ఇప్పుడీ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.

ధనుష్ లేటెస్ట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఇడ్లీ కడై. ఈ సినిమాకు థియేటర్లో పాజిటివ్ టాక్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఓ వైపు కాంతార చాప్టర్ 1 నుంచి పోటీ ఉన్నా ఇడ్లీ కడై బాక్సాఫీస్ దగ్గర నిలకడగా రాణిస్తోంది. ఇప్పుడీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై క్రేజీ బజ్ నెలకొంది. ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

దసరా పండుగను పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ 1న ఇడ్లీ కడై థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు...