భారతదేశం, నవంబర్ 3 -- నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాము ఇంటికి సిట్, ఎక్సైజ్, పోలీస్ అధికారులు చేరుకున్నారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. మూడు నాలుగు గంటలపాటు అక్కడ హడావుడి నడిచింది. అయితే తర్వాత జోగి రమేశ్ బయటకు వచ్చారు. దీంతో సిట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

జోగి రమేశ్‌ను సుమారు 12 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. ఆయన సోదరుడు రాముని కూడా వేరేగా విచారించారు. జనార్దనరావుతో సంబంధాలపై ఆరా తీశారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత అధికారులు జోగి రమేశ్‌ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అర్ధారాత్రి దాటిన తర్వాత వాదనలు మెుదలవ్వగా.. న్యాయమూర్తి తెల్లవారుజామున 5 గంటలకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. మెుదట...