భారతదేశం, జనవరి 10 -- దేశంలో వరుసగా జరుగుతున్న స్లీపర్ బస్సు ప్రమాదాలు, ప్రాణనష్టాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై స్లీపర్ బస్సుల నిర్మాణాన్ని కేవలం వాహన తయారీ సంస్థలు (ఓఈఎంలు) లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక గుర్తింపు పొందిన బాడీ బిల్డింగ్ యూనిట్లు మాత్రమే చేపట్టాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తేల్చిచెప్పారు. నాణ్యతను పెంచడం, ప్రమాదాలకు బాధ్యతను నిర్దేశించడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొస్తున్నట్టు ఆయన తెలిపారు.

ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న పాత బస్సులకు కూడా గడ్కరీ కీలక సూచనలు చేశారు. ప్రయాణికుల రక్షణ కోసం పాత బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్ (మంటలను గుర్తించే పరికరాలు), ఎమర్జెన్సీ లైటింగ్, డ్రైవర్ నిద్రమత్తును గుర్తించే వార్నింగ్ సిస్టమ్‌లను కచ్చితంగా ఏర్పాటు చేయాల్సి ఉంట...