భారతదేశం, సెప్టెంబర్ 18 -- ఫిట్‌నెస్ కోచ్ రాజ్ గణపత్ సోషల్ మీడియాలో ఆహారం, వ్యాయామం, జీవనశైలిపై విలువైన సలహాలు ఇస్తూ ఉంటారు. సెప్టెంబర్ 17న ఆయన ఒక ముఖ్యమైన సమస్య గురించి మాట్లాడారు. అదేంటంటే.. రోజూ జిమ్‌కి వెళ్లినా, కష్టపడి వ్యాయామం చేసినా చాలామందిలో ఆశించిన ఫలితాలు కనిపించకపోవడం. "మీరు బలంగా మారాలని ప్రయత్నిస్తున్నా, అది జరగడం లేదంటే ఈ విషయాలను కచ్చితంగా వినాలి" అని రాజ్ తన వీడియోలో చెప్పారు.

బలం పెరగడానికి, వ్యాయామం పూర్తి ప్రయోజనాలు పొందడానికి ఆయన 6 సూచనలు చేశారు. అవేంటో చూద్దాం.

"ప్రతి వారం 30 రకాల వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఆరు కీలకమైన వ్యాయామాలు చాలు - స్క్వాట్, డెడ్‌లిఫ్ట్, బెంచ్ ప్రెస్ (లేదా పుష్-అప్), ఓవర్‌హెడ్ ప్రెస్, పుల్-అప్ (లేదా హ్యాంగ్), రో. బలం కావాలంటే తక్కువ వ్యాయామాలు చేయండి. అయితే, వాటిని సరిగ్గా చేయండి. ...