భారతదేశం, జనవరి 28 -- ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ బ్యాంకు ఆఫీసర్ కొలువు అంటే సమాజంలో ఉండే గౌరవమే వేరు. అయితే, ఆ గౌరవంతో పాటు జీతభత్యాలు కూడా భారీగానే ఉంటాయని నిరూపిస్తోంది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)గా పనిచేస్తున్న శ్వేతా ఉప్పల్ తన శాలరీ స్లిప్ వివరాలను పంచుకోవడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు.

శ్వేతా ఉప్పల్ 2022లో ఐబీపీఎస్ పీఓ (IBPS PO) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎస్‌బీఐలో చేరారు. ప్రస్తుతం ఆమె 'బ్యాంకర్స్ ట్రిక్' (@bankerstrick) అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన కెరీర్ విశేషాలను పంచుకుంటున్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. రెండున్నరేళ్ల సర్వీసు తర్వాత ఆమె అందుకుంటున్న జీతం వివరాలు ఇలా ఉన్నాయి:

సాధారణంగా ఎస్‌బీఐ పీఓ బేసిక్ పే Rs.56,000 ప్రాంతంల...