భారతదేశం, నవంబర్ 28 -- నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో 'దిత్వా' తుఫాన్ నెమ్మదిగా కదులుతోంది. గడిచిన 6 గంటల్లో 4 కి.మీ వేగంతో తుఫాన్ ముందుకు సాగిందని వాతావరణశాఖ తెలిపింది. పుదుచ్చేరికి 420 కి.మీ., చెన్నైకి 520 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది.

తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఎల్లుండికి నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు తుఫాన్ చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా వేసింది.

ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రేపు,ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సోమవారం దక్షిణ కోస్తా, రా...