భారతదేశం, ఏప్రిల్ 30 -- నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్‍లో చాలా సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి. రెండు చిత్రాలను ఇదే నెలలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చింది నెట్‍ఫ్లిక్స్ ఇండియా. అయితే, ఈ రెండు అనుకున్న రేంజ్‍లో సక్సెస్ కాలేకపోయాయి. కంటెంట్ పరంగానూ ఈ రెండు సినిమాలు నిరాశపరిచాయి. అయితే, ఓ తెలుగు మూవీ, తమిళ చిత్రం దుమ్మురేపాయి. ఛావా చిత్రం కూడా అదరగొట్టింది. నెట్‍ఫ్లిక్స్ ఏప్రిల్ రౌండప్ ఇక్కడ చూడండి.

టెస్ట్ సినిమాను ఈనెల ఏప్రిల్ 4వ తేదీన డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చింది నెట్‍ఫ్లిక్స్. ఈ తమిళ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో మాధవన్, నయనతార, సిద్ధార్థ్ లాంటి స్టార్ యాక్టర్లు ఉండటంతో మంచి బజ్ నెలకొంది. అయితే, ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. స్టోరీ స్ట్రాంగ్‍గా లేకపోవటం, కథనం కూడా మరీ ఆసక్తిగా లేకపోవటంతో అనుకున్న రేంజ్‍లో వ్యూస్ దక్కలేదు. తమిళంత...