Hyderabad, జూన్ 5 -- హారర్ వెబ్ సిరీస్ అభిమానులకు గుడ్ న్యూస్. నెట్‌ఫ్లిక్స్ లో రెండున్నరేళ్ల కిందట వచ్చిన హారర్ సిరీస్ వెన్స్‌డే (Wednesday)కు ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది. అది కూడా రెండు భాగాలుగా కావడం విశేషం. గత ఏప్రిల్ నెలలో ఈ రెండో సీజన్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్ గురువారం (జూన్ 5) ఈ రెండో సీజన్ తొలి 6 నిమిషాల వీడియోను రిలీజ్ చేయడం విశేషం.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన వెన్స్‌డే వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలో ఏకంగా 8 రేటింగ్ నమోదైంది. దీంతో రెండో సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఆ ఓటీటీ తొలి 6 నిమిషాల వీడియో రిలీజ్ చేసింది.

ఇందులో వెన్స్‌డే అనే అమ్మాయిని ఓ కుర్చీకి కట్టేసి ఉండటం చూడొచ్చు. తాను సీరియల్ కిల్లర్ బేస్‌మెంట్ లో ఉన్నానని, తానే అతని తర్వాత టార్గెట్ అని అతడ...