భారతదేశం, జనవరి 29 -- పొగమంచు కమ్మిన పంజాబ్ పొలాలు, చీకటి కోణాలు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తో 'కోహ్రా' (Kohrra) వెబ్ సిరీస్ ప్రపంచం మళ్లీ వచ్చేసింది. మొదటి సీజన్ ఘనవిజయం తర్వాత రెండో సీజన్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గురువారం (జనవరి 29) ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఇందులో బరుణ్ సోబ్టీ తన పాత్రలో తిరిగి రాగా.. ప్రముఖ నటి మోనా సింగ్ కొత్త చీఫ్ ఇన్వెస్టిగేటర్‌గా జతకట్టింది. పంజాబ్‌లోని దలేర్‌పురా అనే చిన్న పట్టణంలో జరిగిన ఒక మహిళ హత్యను ఛేదించే క్రమంలో ఈ ఇద్దరు పోలీసులు ఎదుర్కొన్న సవాళ్లు, అబద్ధాలు, మోసాలను ట్రైలర్ కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి ఈ కోహ్రా. తొలి సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కోహ్రా అంటే పంజాబీలో పొగ మంచు అని అర్థం. అందుకు తగినట్లుగానే ఈ సిరీస్ ...