భారతదేశం, సెప్టెంబర్ 16 -- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రొమాంటిక్ వెబ్ సిరీస్ 'బ్యూటీ ఇన్ బ్లాక్' అదరగొడుతోంది. ఈ సీజన్ 2 ఇప్పటికే ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. వ్యూస్ పరంగా దూసుకెళ్తోంది. ఈ బ్యూటీ ఇన్ బ్లాక్ సీజన్ 2 పార్ట్ 2 కూడా త్వరలోనే రాబోతుంది.

నెట్‌ఫ్లిక్స్ రొమాంటిక్ వెబ్ సిరీస్ బ్యూటీ ఇన్ బ్లాక్ సీజన్ 2 పార్ట్ 1 ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ పార్ట్ 1 సెప్టెంబర్ 11న రిలీజ్ అయింది. 11 ఎపిసోడ్లు ఒకేసారి స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఈ పార్ట్ 1కు ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో పార్ట్ 2 పై అంచనాలు పెరిగిపోయాయి.

పీపుల్ ప్రకారం, టేలర్ పోలిడోర్ విలియమ్స్ కిమ్మీగా లీడ్ రోల్ ప్లే చేసిన ఈ నెట్‌ఫ్లిక్స్ డ్రామా, రొమాంటిక్, ట్విస్ట్ లతో కూడిన సిరీస్ బ్యూటీ ఇన్ బ్లాక్ ఈ ఓటీటీలో సత్తాచాటుతోంది. హోరేస్ (రికో రాస్) కిమ...