భారతదేశం, డిసెంబర్ 20 -- ఓటీటీలో కొత్త ట్రెండ్. సాధారణంగా అయితే ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన చాలా రోజుల తర్వాత సినిమాలు ఇతర ఓటీటీల్లోకి వస్తాయి. కానీ ఒరిజినల్ వెబ్ సిరీస్ లు మాత్రం అలా కాదు. ఏ ఓటీటీకి ఆ ఓటీటీ స్పెషల్ వెబ్ సిరీస్ లు ఉంటాయి. ఇప్పుడా వెబ్ సిరీస్ లు కూడా ఒక ఓటీటీలోనివి మరో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈటీవీ విన్ సిరీస్ లు, సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఈటీవీ విన్ ఓటీటీ తమ కోసం స్పెషల్ గా రూపొందించిన సినిమా, సిరీస్ లు ఇప్పుడు మరో పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేశాయి. రెండు వెబ్ సిరీస్ లు, ఓ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ వెబ్ సిరీస్ లు.. 90'స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్, ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) కాగా, సినిమా ఏమో లిటిల్ హార్ట్స్.

ఈటీవీ విన్ అనగానే ఇప్పుడు అందరిక...