భారతదేశం, జూలై 9 -- నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ వెబ్ సిరీస్ మాన్‌స్ట‌ర్‌ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. రియల్ క్రైమ్ స్టోరీస్ లను బేస్ చేసుకుని ఈ సీజన్లు రూపొందించారు. ప్రస్తుతం మూడో సీజన్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే మాన్‌స్ట‌ర్‌ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ ఉంటుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

ర్యాన్ మర్ఫీ ఆంథాలజీ సిరీస్ మాన్‌స్ట‌ర్‌ 4వ సీజన్‌కు నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ మూడవ సీజన్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. వైరిటీ నివేదిక ప్రకారం, లిజ్జీ బోర్డెన్ హత్యలు మాన్‌స్ట‌ర్‌ ఆంథాలజీ సిరీస్‌లో నాలుగవ సీజన్‌గా ఉంటాయి. ఈ కథ లిజ్జీ బోర్డెన్‌, ఆమెపై డబుల్ మర్డర్ ఆరోపణల చుట్టూ సాగుతుందని తెలుస్తోంది.

1892...