భారతదేశం, జనవరి 16 -- పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో కొత్త సినిమాల పండగ రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్ పండగలో భాగంగా ఈ ఓటీటీ వేదికలో రాబోతున్న న్యూ మూవీస్ ను ఈ ప్లాట్ ఫామ్ ఇవాళ అనౌన్స్ చేస్తోంది. ఇందులో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి నాని మూవీ ప్యారడైజ్ వరకు కొత్త సినిమాలున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్-హరీష్ కాంబినేషన్ అనగానే క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా నుంచి రిలీజైన దేఖ్ లేంగే సాంగ్ ఊపేస్తుంది. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రాబోతుంది.

''అనుమతి కోసం న్యాయం ఎదురు చూడదు. అతను కూడా అంతే. థియేట్రికల్ రిలీజ్ తర్వాత సినిమా తెలుగు, తమ...