Hyderabad, మే 28 -- ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫామ్ పై స్ట్రీమింగ్ అయిన నాలుగు పాపులర్ వెబ్ సిరీస్ లకు కొత్త సీజన్లు అనౌన్స్ చేసింది. బుధవారం (మే 28) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయం వెల్లడించింది. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బ్లాక్ వారెంట్ తోపాటు లీగల్ డ్రామా మామ్లా లీగల్ హై, ఈ మధ్యే వచ్చిన ది రాయల్స్, రొమాంటిక్ కామెడీ మిస్‌మ్యాచ్డ్ లాంటి సిరీస్ ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వరుసగా తన వెబ్ సిరీస్ లకు కొత్త సీజన్లు అనౌన్స్ చేసే పనిలో బిజీగా ఉంది. ఇలా ఒకేసారి నాలుగు సిరీస్ లకు సీక్వెల్స్ అనౌన్స్ చేయడం విశేషం. మొదటగా ఈ మధ్యే తొలి సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది రాయల్స్ వెబ్ సిరీస్ సీక్వెల్ గురించి వెల్లడించింది.

ప్రస్తుతం రెండో సీజన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే స్ట్రీమింగ్ కు వస్తుందని తెలిపింది. ఇషాన్ ఖట్టర్, భూమి...