భారతదేశం, డిసెంబర్ 8 -- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి గత వారమే అడుగుపెట్టిన రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ అప్పుడే తొలి స్థానంలోకి దూసుకెళ్లింది. థియేటర్లతోపాటు ఓటీటీలోనూ ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోందనడానికి ఇదే నిదర్శనం. సోమవారం (డిసెంబర్ 8) నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో ఏమేం ఉన్నాయో ఒకసారి చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో రష్మిక మందన్న లీడ్ రోల్లో నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ ఉంది. గత శుక్రవారమే (డిసెంబర్ 5) ఈ మూవీ స్ట్రీమింగ్ మొదలైంది. మూడు రోజుల్లోనే టాప్ లోకి దూసుకెళ్లడం విశేషం. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

టాక్సిక్ రిలేషన్షిప్ లో చిక్కుకునే భూమా అనే అమ్మాయి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ సినిమా తెలుగుతోపాటు కన్నడ, ...