భారతదేశం, డిసెంబర్ 5 -- ఎంటర్టైన్మెంట్ వరల్డ్‌లోనే అతిపెద్ద సంచలనం నమోదైంది. స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్.. హాలీవుడ్ ప్రముఖ స్టూడియో వార్నర్ బ్రదర్స్‌ను (Warner Bros.) కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో వార్నర్ బ్రదర్స్ ఫిల్మ్, టెలివిజన్ స్టూడియోలతో పాటు హెచ్‌బీవో, హెచ్‌బీవో మ్యాక్స్ కూడా నెట్‌ఫ్లిక్స్ చేతికి వెళ్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది.

టుడుమ్ (Tudum) రిపోర్టు ప్రకారం ఈ డీల్ విలువ మొత్తం 82.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7.3 లక్షల కోట్లు). ఇది నగదు, స్టాక్ లావాదేవీల రూపంలో జరుగుతుంది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (WBD) ఒక్కో షేరు విలువను 27.75 డాలర్లుగా నిర్ణయించారు.

ఈ భారీ కొనుగోలుపై నెట్‌ఫ్లిక్స్ కో-సీఈఓ టెడ్ సరండోస్ ఒక ప్రకటన విడుదల చేశారు. "ప్రపంచాన్ని అలరించడమే మా లక్ష్య...