Hyderabad, జూన్ 8 -- ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో పాపులారిటీ పొందినవాటిలో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. ప్రతివారం సరికొత్త కంటెంట్‌తో ఓటీటీ ప్రియులను ఆకర్షిస్తుంది. అలాంటి నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం. అలాగే, వాటిలోని ది బెస్ట్ 4 సినిమాలపై లుక్కేద్దాం.

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన తొలి బాలీవుడ్ మూవీ జాట్. జూన్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తెలుగు భాషల్లో జాట్ ఓటీటీ రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 1 ప్లేసులో జాట్ దూసుకుపోతోంది. యాక్షన్ థ్రిల్లర్‌ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 120 కలెక్షన్స్ రాబట్టింది. దీంతో జాట్ చూసేందుకు బెస్ట్ మూవీగా నిలిచింది.

నేచురల్ స్టార్ నాని-శైలేష్ కొలను కాంబినేషన్‌లో వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హిట్ 3 నెట్‌ఫ్లిక్స్ ఓ...