Hyderabad, సెప్టెంబర్ 8 -- ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ నటించిన మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ ఏడాది ఏప్రిల్లో థియేటర్లలో రిలీజ్ కాగా.. మేలో నెట్‌ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఈ సినిమాలో తన అనుమతి లేకుండా తన పాటలు వాడుకున్నారంటూ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మద్రాస్ హైకోర్టుకు వెళ్లాడు. దీంతో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ మూవీని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తమిళంతోపాటు తెలుగులోనూ తన మ్యూజిక్ తో అలరించిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. అయితే తన అనుమతి లేకుండా తన పాటలను వాడుకునే మూవీ మేకర్స్ ను అతడు అంత సులువుగా వదిలిపెట్టడు. అవసరమైతే కోర్టు మెట్లు ఎక్కుతాడు. ఆ మధ్య మంజుమ్మెల్ బాయ్స్ మూవీ విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలోనూ తన పాటలను వాడుకోవడంపై సుమారు ఐదు నెలల కిందటే మూవీ టీమ్ కు ఇళ...