భారతదేశం, డిసెంబర్ 7 -- దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో క్రేజీ అప్‌కమింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో ఎన్నో సినిమాలు ఉన్నాయి. అయితే, వాటిలో అస్సలు మిస్ అవ్వకూడని ఆరు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. బోల్డ్ నుంచి థ్రిల్లర్ వరకు మిస్ అవ్వకూడని ఆ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన సిరీస్ ది యాక్సిడెంట్. ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పడు సీజన్ 2 వస్తోంది. ఓ కుటుంబం చుట్టూ సాగే ఈ సిరీస్ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 10 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

సౌది అరేబియన్ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ది ఫేక్‌న్యాపింగ్. అప్పుల్లో కూరుకుపోయిన తండ్రీ, కొడుకు దాని నుంచి తప్పించుకునేందుకు అద్భుతమైన ప్లాన్ వేస్తారు. కొడుకు తన సొంత తండ్రిని కిడ్నాప్ చేసినట్లు ...