భారతదేశం, జూలై 2 -- ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన కొరియన్ థ్రిల్లర్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' సీజన్ 3 నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే 60.1 మిలియన్ల వ్యూస్‌ను సాధించి, నెట్‌ఫ్లిక్స్ వీక్లీ టాప్ 10 చార్ట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 'స్క్విడ్ గేమ్' సీజన్ 3 అతి తక్కువ సమయంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లీష్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది.

మొదటి 3 రోజుల వ్యూయర్ షిప్ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే అత్యధికంగా చూసిన నాన్-ఇంగ్లీష్ టీవీ షోగా 'వెరైటీ' అభివర్ణించింది. ఈ సీజన్ మొన్న శుక్రవారం విడుదల కావడం విశేషం.

గతంలో సీజన్ 2 డిసెంబర్ 26న గురువారం విడుదలైంది. అది నాలుగు రోజులలో 68 మిలియన్ల వ్యూస్‌తో రికార్డులను బద్దలు కొట్టింది. 2022లో 'వెన్స్ డే' సిరీస్ 50.1 మిలియన్ల వ్యూస్‌తో ...