భారతదేశం, డిసెంబర్ 19 -- ఐదేళ్ల కిందట వచ్చిన సూపర్ హిట్ థ్రిల్లర్ 'రాత్ అకేలీ హై'కి సీక్వెల్‌గా వచ్చిన 'రాత్ అకేలీ హై 2: ది బన్సల్ మర్డర్స్' (Raat Akeli Hai 2) ఓటీటీలో విడుదలైంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి పోలీస్ ఆఫీసర్ జటిల్ యాదవ్‌గా మెప్పించాడు. బన్సల్ కుటుంబం మొత్తాన్ని ఒకే రాత్రి గొంతు కోసి చంపటం, ఆ మిస్టరీని ఛేదించే క్రమంలో వచ్చే మలుపులు ఈ సినిమా కథాంశం.

దర్శకుడు హనీ ట్రెహాన్ దర్శకత్వంలో, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'రాత్ అకేలీ హై 2'. మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమా కథేంటి? ఎలా ఉందో తెలుసుకోండి.

ఇది బన్సల్ అనే సంపన్న కుటుంబం కథ. ఒకరోజు రాత్రి ఆ కుటుంబం మొత్తం దారుణ హత్యకు గురవుతుంది. అందరి గొంతులు కోసి చంపేస్తారు. ఒకవైపు కా...