Hyderabad, ఏప్రిల్ 23 -- కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో దుమ్ము రేపుతోంది. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమాకు ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ సినిమాల్లో వరుసగా రెండో వారం కూడా టాప్ 10లోనే ఉంది.

ప్రియదర్శి, శివాజీ, రోషన్, శ్రీదేవిలాంటి వాళ్లు నటించిన మూవీ కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 11న స్ట్రీమింగ్ కు వచ్చిన కోర్ట్ మూవీ.. తొలి వారం గ్లోబల్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో ఐదో స్థానంలో నిలిచింది. ఇక తాజాగా రెండో వారం కూడా టాప్ 10లోనే కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఆరో స్థానంలో ఉంది. మరో ఇండియన్ మూవీ ఛావా ఐదో స్థానంలో ఉంది.

కోర్ట్ మూవీకి ఇప...