భారతదేశం, డిసెంబర్ 28 -- ఈ ఏడాది అంటే 2025లో నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి వెబ్ సిరీస్ అందించింది. హాలీవుడ్, బాలీవుడ్, కొరియన్.. ఇలా అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ సిరీస్‌లు వచ్చాయి. ఈ ఏడాది టాప్-10లో నిలిచిన సిరీస్‌లు ఏవో, వాటి కథలేంటో ఇక్కడ చూసేయండి. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన సిరీస్‌లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. వాటిలో మీరు మిస్ అవ్వకూడని టాప్ 10 లిస్ట్ ఇదే.

నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన బెస్ సిరీస్ అని చెప్పొచ్చు. బ్రిటిష్ క్రైమ్ డ్రామా అడొలసెన్స్. ఇది మొత్తం 'రియల్ టైమ్' లో సింగిల్ టేక్ షాట్స్‌తో తీశారు. ఏకంగా 8 ఎమ్మీ అవార్డులు గెలుచుకుంది. ఇందులో నటించిన కుర్రాడు ఓవెన్ కూపర్, ఎమ్మీ గెలిచిన అతి పిన్న వయసు యాక్టర్‌గా రికార్డు సృష్టించాడు.

13 ఏళ్ల కుర్రాడు తన క్లాస్‌మేట్‌ను చంపేస్తాడు. అసలు 'ఎవరు చేశారు' అని కాకుండా 'ఎం...