Hyderabad, మే 12 -- థ్రిల్లర్ సినిమాలు, అందులోనూ మలయాళం నుంచి వచ్చిన వాటికి మీరు పెద్ద అభిమానులా? అయితే మీరు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఉన్న ఈ మూవీస్ ను మిస్ కాకుండా చూడాల్సిందే. ఈ సినిమాలకు ఐఎండీబీలోనూ మంచి రేటింగ్ నమోదైంది. మరి ఆ సినిమాలు ఏవి, వాటిని ఎందుకు చూడాలో తెలుసుకోండి.

కురుప్ 2021లో వచ్చిన మలయాళం థ్రిల్లర్ మూవీ. దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో నటించాడు. ఇదో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. సుకుమార కురుప్ అనే క్రిమినల్ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. తన లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మరో వ్యక్తిని చంపి పారిపోయిన వ్యక్తి ఆ తర్వాత దానిని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని తప్పులు చేస్తాడు? కొన్ని దశాబ్దాలుగా అతడు పోలీసుల కళ్లుగప్పి ఎలా తప్పించుకు తిరుగుతున్నాడన్నదే ఈ కురుప్ మూవీ. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

అమలా పాల్ నటించిన మూవీ ది టీచర్. 2022ల...