Hyderabad, ఏప్రిల్ 23 -- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఓ హారర్ కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ రానుంది. దీనికి సంబంధించిన టీజర్ ను బుధవారం (ఏప్రిల్ 23) ఆ ఓటీటీ రిలీజ్ చేసింది. ఈ వెబ్ సిరీస్ పేరు వెన్స్‌డే (Wednesday). సుమారు రెండున్నరేళ్ల కిందట వచ్చిన తొలి సీజన్ ప్రేక్షకులను వణికించగా.. ఇప్పుడు రెండో సీజన్ రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

వెన్స్‌డే వెబ్ సిరీస్ రెండో సీజన్ టీజర్ భయపెడుతోంది. ఈ సిరీస్ లోని ప్రధాన పాత్ర వెన్స్‌డే ఆడమ్స్ ఈ కొత్త సీజన్లో మరింత ప్రమాదకరంగా మారి భయపెట్టడానికి వస్తున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ టీజర్ రిలీజ్ గురించి ఒక రోజు ముందే వెల్లడించిన నెట్‌ఫ్లిక్స్.. బుధవారం (ఏప్రిల్ 23) రాత్రి రిలీజ్ చేసింది.

"మీ కేలండర్ ను ఇప్పుడే క్లియర్ చేసి పెట్టుకోండి. వెన్స్‌డే సీజన్ 2 ఆగస్ట్ 6 నెట్‌ఫ్లిక్స్ లోకి రాబ...