Hyderabad, సెప్టెంబర్ 4 -- నెట్‌ఫ్లిక్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లవర్స్ కు గుడ్ న్యూస్. 'ది గేమ్' అనే కొత్త తమిళ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్‌మెంట్‌ను మేకర్స్ గురువారం (సెప్టెంబర్ 4) సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. 'ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్' అనే ఈ సిరీస్ ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ ఇండియా మొదటి తమిళ వెబ్ సిరీస్. నటి శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్‌లో నటించిన ఒక థ్రిల్లర్ అని చెబుతున్నారు. ఇది అక్టోబర్ 2న దసరా, గాంధీ జయంతి సందర్భంగా ప్రీమియర్ అవుతుంది.

ప్రముఖ నటి శ్రద్ధా శ్రీనాథ్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది గేమ్. నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ అనౌన్స్‌మెంట్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా చేసింది. "గేమ్ డెవలపర్ జీవితంలో ఇది కచ్చితంగా అత్యంత కఠినమైన లెవల్ కావచ్చు.. ది గేమ్ అక్టోబర్ 2న కేవలం నెట్‌...