Hyderabad, అక్టోబర్ 14 -- ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో దాదాపు ప్రతిరోజూ బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు రిలీజ్ అవుతుంటాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలను స్ట్రీమింగ్ మొదలైన తర్వాత వివాదాలు తలెత్తడంతో నిషేధించాల్సి వచ్చింది. ముఖ్యంగా కొన్ని దేశాల్లో అభ్యంతరాలు రావడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ సినిమాలేవో తెలుసుకోండి.

ఓటీటీలో ఏదైనా సినిమాను రిలీజ్ చేయడం వల్ల ఒక లాభం ఏంటంటే.. మేకర్స్ సినిమా లేదా సిరీస్ నిడివి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక ఒక కథను వెబ్ సిరీస్ లో మరింత వివరంగా చూపించవచ్చు. అంతేకాకుండా సాధారణంగా సినిమాలు తీసేటప్పుడు, వాటిని రిలీజ్ చేసేటప్పుడు ఉండేటటువంటి ఎన్నో రకాల లైసెన్సులు తీసుకోవాల్సిన కష్టం కూడా ఉండదు. అయితే వీటి వల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి.

ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ...