Hyderabad, సెప్టెంబర్ 18 -- కేజీఎఫ్ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ సమర్పించిన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ. జులై 25న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించింది. మొత్తానికి సుమారు నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. నెట్‌ఫ్లిక్స్ లో ఐదు భాషల్లో సినిమా స్ట్రీమింగ్ కానుంది.

పెద్దగా బజ్ లేకుండా ఓ సాదాసీదా యానిమేషన్ మూవీగా రిలీజై తర్వాత బ్లాక్‌బస్టర్ అయిన మహావతార్ నరసింహ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమాను శుక్రవారం (సెప్టెంబర్ 19) నుంచి నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ గురువారం (సెప్టెంబర్ 18) సాయంత్రం తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించింది.

"భక్తి శక్తి రూపం తీసుకుంటుంది. మహావతార్ నరసింహ వచ్చేస్తోంది. సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 12.30 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్ లో మహావతార్ నరసింహ చూడండి" అనే క్యాప్షన్ తో...