భారతదేశం, జనవరి 28 -- నెట్‌ఫ్లిక్స్ తన రాబోయే కొత్త హారర్ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. దీనికి 'సమ్‌థింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్' (Something Very Bad Is Going To Happen) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సిరీస్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా ప్రపంచ ప్రఖ్యాత 'స్ట్రేంజర్ థింగ్స్' క్రియేటర్స్ మాట్, రాస్ డఫర్ (డఫర్ బ్రదర్స్) వ్యవహరిస్తుండగా, 'బేబీ రెయిన్‌డీర్' ఫేమ్ వెరోనికా టోఫిల్స్కా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ హారర్ వెబ్ సిరీస్ కథ ఒక పెళ్లి చేసుకోబోయే జంట చుట్టూ తిరుగుతుంది. దురదృష్టవశాత్తు వారి పెళ్లికి వారం ముందు జరిగే భయానక సంఘటనలే ఈ వెబ్ సిరీస్ కథాంశం. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉండే ఈ సిరీస్ మార్చి 26 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

స్క్రీన్ రైటర్ హేలీ జెడ్ బోస్టన్ ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిం...