భారతదేశం, అక్టోబర్ 30 -- హారర్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల కోసం మరో సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని వచ్చే వారం స్ట్రీమింగ్ చేయనుంది. కొన్నాళ్ల కిందట ఈ సినిమా గురించి వెల్లడించిన ఆ ఓటీటీ.. తాజాగా గురువారం (అక్టోబర్ 30) ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇది ఆసక్తికరంగా సాగింది.

ప్రముఖ నటుడు మానవ్ కౌల్ ప్రధాన పాత్ర పోషించిన 'బారాముల్లా' మూవీ ట్రైలర్ ని నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇందులో కశ్మీర్ లోయల లోతుల్లో దాగి ఉన్న ఒక రహస్యం చుట్టూ కథ తిరగనుంది. బారాముల్లా అనే పట్టణంలో అకస్మాత్తుగా పిల్లలు అదృశ్యం కావడంతో ఈ ట్రైలర్ మొదలైంది. ఆ మిస్సింగ్ కేసులను పరిష్కరించడానికి ఓ పోలీస్ అధికారి రంగంలోకి దిగుతాడు. ఆ పాత్రనే మానవ్ కౌల్ పోషించాడు. ఈ ట్రైలర్ మిస్టరీతో కూడి ఉండటం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

'బారాముల్లా' ...