Hyderabad, ఆగస్టు 4 -- స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంటే ఇష్టపడతారా? అయితే మీ కోసమే ఈ ఇండిపెండెన్స్ డే కోసం ఓ సరికొత్త సిరీస్ రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టనున్న ఈ వెబ్ సిరీస్ పేరు సారే జహాన్ సే అచ్చా. ప్రతీక్ గాంధీ లీడ్ రోల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ సోమవారం (ఆగస్ట్ 4) రిలీజైంది.

నెట్‌ఫ్లిక్స్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సారే జహాన్ సే అచ్చా ట్రైలర్ వచ్చేసింది. ఆగస్ట 13 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసింది. పాకిస్థాన్ న్యూక్లియర్ మిషన్ ను ఆపడానికి ప్రయత్నించే ఓ ఇండియన్ స్పై చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ఈ సిరీస్ 1970ల నేపథ్యంలో సాగుతుంది. ప్రతీక్ గాంధీ, తిలోతమా షోమ్, కృతికా కామ్ర, సన్నీ హిందుజా నటించిన ఈ సిరీస్‌పై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి ఉంది.

'సారే జహాన్ సే అచ్చా' ట్రైలర్‌లో ప్రతీక్...