Hyderabad, అక్టోబర్ 1 -- నెట్‌ఫ్లిక్స్ లోకి 'కురుక్షేత్ర' వెబ్ సిరీస్ వస్తోంది. మహాభారత ఇతిహాసం ఆధారంగా చేసుకుని నిర్మించిన ప్రతిష్టాత్మక యానిమేటెడ్ సిరీస్ ఇది. ఈ 'కురుక్షేత్ర' నెట్‌ఫ్లిక్స్‌లో తన అధికారిక ట్రైలర్‌ ను రిలీజ్ చేసింది. అక్టోబర్ 10న స్ట్రీమింగ్ కాబోయే ఈ 18 రోజుల ధర్మయుద్ధం స్టన్నింగ్ విజువల్స్ తో ఆకట్టుకోబోతోందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. తెలుగు సహా ఏకంగా 10 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతున్న ఈ సిరీస్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సుమారు రెండున్నర నిమిషాల పాటు కురుక్షేత్ర ట్రైలర్ ఉంది. ఈ ట్రైలర్‌లో యుద్ధభూమి తీవ్రతను, భారీతనాన్ని స్పష్టంగా తెలియజేసే అద్భుతమైన, డ్రామాటిక్ యానిమేషన్‌ను చూపించారు. దివ్య ఆయుధాలు, అస్త్రాలను వాడే సమయంలో చూపించే విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. వైబ్రెంట్ కలర్ స్కీమ్‌ను...