భారతదేశం, నవంబర్ 26 -- నెట్‌ఫ్లిక్స్ ఈ మధ్యే సౌత్ భాషల్లో ఒరిజనల్ కంటెంట్ పెంచుతోంది. అలా తమిళంలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను తీసుకొస్తోంది. ఈ మూవీ పేరు స్టీఫెన్. బుధవారం (నవంబర్ 26) మూవీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమా డిసెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. గతంలో ఓ ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ట్రైలర్ తో మరింత ఆసక్తి రేపారు.

'స్టీఫెన్' నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతున్న తమిళ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ చిత్ర ట్రైలర్‌ను ఆ ఓటీటీ తాజాగా విడుదల చేసింది. ట్రైలర్ ప్రారంభం ఒక న్యూస్ రీడర్ వాయిస్‌తో మొదలవుతుంది. యువతులను లక్ష్యంగా చేసుకున్న సీరియల్ కిల్లర్ కేసు గురించి చెబుతూ ఉంటుంది. ఈ హత్యలకు తానే కారణమని అంగీకరించిన ముద్దాయి స్టీఫెన్ జెభరాజ్.. తనకు లాయర్ కూడా అవసరం లేదని కోర్టులో చెబుతాడు.

అతను తొమ్మ...