Hyderabad, ఆగస్టు 27 -- విజయ్ దేవరకొండ సినిమా 'కింగ్డమ్' ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బుధవారం అంటే ఆగస్టు 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ గా నిలిచి మేకర్స్‌కి భారీగా నష్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఓటీటీలో కాస్త పాజిటివ్ రివ్యూలు వస్తున్నా.. ఫ్యాన్స్ మాత్రం కట్స్ విషయంలో అసంతృప్తితో ఉన్నారు.

కింగ్డమ్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్స్ నిరాశగా ఉండటానికి ఓ కారణం ఉంది. వాళ్లకు ఎంతో నచ్చిన పాట లేకపోవడమే దీనికి కారణం. ప్రమోషన్స్ టైంలో మేకర్స్ 'హృదయం లోపల' అనే ఒక పాటను రిలీజ్ చేశారు. అది చార్ట్‌బస్టర్‌గా మారి సినిమా రిలీజ్‌కి ముందు మంచి హైప్ ఇచ్చింది. కానీ రన్‌టైమ్ సమస్యల కారణంగా ఆ పాటను తీసేయడంతో ఫ్యాన్స్‌కి షాక్ తగిలింది...